Kallalloki Kallepettestu

ఓహో... ఎన్ని ఎన్ని ప్రేమలో...
ఓహో... ఎన్ని ఎన్ని పేరులో
కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
అమ్మా, బాబుకి మేటర్ లీకయ్యి
Left and right కోటింగ్ మొదలయ్యి
జిందగి మొత్తం చిరిగీ చేటయ్యి... life long ఏడుస్తారే
ఇట్టా ఇట్టా ఎల్లాకిల్లా డల్లైపోయే మీకోసం
గండాలన్నీ గట్టెక్కించే కొత్త జంట మా ప్రోగ్రాం
లవ్వూ గివ్వూ లావాదేవీ క్షణాలలో తేలుస్తాం
ఇష్కే మీది రిస్కే మాది... బ్యాండు బాజా మోగిస్తాం

కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
ఆర్య సమాజూ... రిజిస్టార్ ఆఫీసూ
చర్చీ, మసీదులూ... వెడ్డింగ్ వెన్యూలే
ఎక్కడా లేనంతా... పక్కా గ్యారెంటీ

టైటూ సెక్యూరిటీ మేం అందిస్తంలే
కొత్తా జంటలకి ఊపిరిపోస్తాం
పెండింగ్ ప్రేమా కథలు సెటిలే చేస్తాం
బాబులకీ... బాంబులకీ... లొంగని మా... సత్తా చూపిస్తాం...

చలో చలో మీలో వున్న భయానికే బ్రేకేస్తాం
మీకూ మీకూ ఓకే ఐతే మిగతాదంతా మేం చూస్తాం
నిజంగానే మీ ప్రేమకి మా ప్రాణాలే అడ్డేస్తాం
నిఖార్సుగా నమ్మారంటే నిఖా షురూ చేసేస్తాం



Credits
Writer(s): Bhaskarabhatla, J.b.
Lyrics powered by www.musixmatch.com

Link