O Meri Siri Siri

ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా

ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా
మనసు మలసిన రవ్వ
నా వయసున వాలిన గువ్వ
ఇకపై వెయ్యేళ్ళు నీతో రానీవా
అరె నిజమైనా, నిదరైనా నీతోనే లోకం
ఎవరౌనన్నా కాదన్నా ఈ పుట్టుక నీకోసం
ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా

వాన విల్లులో అన్ని రంగులూ కలిపేస్తే ఏంటంట
ఆ రంగే తెలుపంట అది నీలో మనసంట
అంతులేనిదై అన్ని వైపులా కనిపించేదేదంట
నీలాల నింగంట, అది నీలో ప్రేమంట
మాటేరాని మౌనంలోను మోగేదే రాగం
ఒక నీకు నాకు ఇద్దరికే వినిపించే అనురాగం
అహ కన్నుల్లో వెన్నెల్లా నువ్వే కార్తీకం
అహ నీ పేరై పలికింది పెదవుల్లో సంగీతం
ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా

ఒక్క జన్మలో రెండు జన్మలై జీవించే వీలుందా
నువ్వే నేనైపోదాం, నేనే నువ్వైపోదాం
జంట కనులకు ఒకే తీరుగ కనిపించే వెలుగుందా
ప్రేమే మన చూపందాం, ప్రేమే మన కల అందాం
చేరే గమ్యం నువ్వని మనసుకు ముందే తెలిసిందా
ఆ బ్రహ్మే రాసిన నా చిరునామా తనపై ఉంది కదా
అరె నాలోని ఊపిరికి నువ్వే రా ప్రాణం
అరె నీకన్నా నా ప్రాణం ఇంకెవరే బంగారం
ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా
మనసు మలసిన రవ్వ
నా వయసున వాలిన గువ్వ
ఇకపై వెయ్యేళ్ళు నీతో రానీవా
అరె నిజమైనా, నిదరైనా నీతోనే లోకం
ఎవరౌనన్నా కాదన్నా ఈ పుట్టుక నీకోసం
ఓ मेरी సిరి సిరి మువ్వ
నా ఎదలో విరిసిన పువ్వా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా
క్షణమొదలక నువ్వు నాతో ఉంటావా



Credits
Writer(s): Ramajogayya Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link