Vintunnava Nestham

ఆనందం ఉరకలు వేస్తే గానం
నేస్తం
నేస్తం
నేస్తం

స్పందించే హృదయాలు
అందించే చప్పట్లు
ఆ శబ్దంలోనే వుంది అంతేలేని సంతోషం
హర్షించే అధరాలు
వర్షించే దీవెనలు
ఆ మంత్రంలోనే వుంది అవధే లేని ఆనందం

ఆనందం ఉరకలు వేస్తే గానం
ఆవేదన మనసును మూస్తే మౌనం
వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం

వింటున్నావా నేస్తం
మౌన సంగీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం

కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు
శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు
అన్నింట తనే ప్రాణం
ఆ ప్రాణ స్వరం మౌనం

ఆనందం ఉరకలు వేస్తే గానం
ఆవేదన మనసును మూస్తే మౌనం
వింటున్నావా నేస్తం
మౌన గీతం
వింటున్నావా నేస్తం
నా మౌన సంగీతం

భూమి గగనంతో ఆడేను వూసులు
బ్రతుకు మరణంతో చేసేను భాషలు
అన్నింటికిదే మూలం
అనాది కథే మౌనం

ఆనందం వురకలు వేస్తే గానం
ఆవేదన మనసును మూస్తే మౌనం
వింటున్నావా నేస్తం
(వింటున్నావా నేస్తం)
మౌన సంగీతం
(మౌన సంగీతం)
వింటున్నావా నేస్తం
(వింటున్నావా నేస్తం)
నా మౌన సంగీతం
(నా మౌన సంగీతం)

వింటున్నావా నేస్తం
(వింటున్నావా నేస్తం)
మౌన సంగీతం
(మౌన సంగీతం)
వింటున్నావా నేస్తం
(వింటున్నావా నేస్తం)
నా మౌన సంగీతం
(నా మౌన సంగీతం)

నేస్తం
నేస్తం



Credits
Writer(s): Ankit Tiwari, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link