Kshaminchave Cheli

క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే
భరించవే నిజం స్మరించకే గతం
నను మరచి నువ్వే జీవించవే

నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే
నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే
నా జీవితం జీవించవే

క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే

నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువ్వే మొక్కే దైవం నువ్వు
చెరగని చరితవ్వు

నిన్నే నమ్మే నేస్తం నువ్వు
నీకందించే సాయం నువ్వు
నువ్వే సాగే దారే నువ్వు
నీకే చెప్పే ధైర్యం నువ్వు
నువ్వే మొక్కే దైవం నువ్వు
చెరగని చరితవ్వు

ఉషోదయం నువ్వే
నిషామయం నేనే
నను మరచి నువ్వే జీవించవే
నను మరచి నువ్వే జీవించవే

నీ పాటల్లోని పదాల మధ్య
ఖాళీని నేనై వుండనా
నీకందబోయే ఆకాశం నిండా
శూన్యాన్ని నేనై నిండనా
నువు కోరుకున్న పేరు కీర్తి వరించనీ
నే పొందలేని కాంతి శాంతి లభించనీ
నను మరచి ఓ జీవించవే

క్షమించవే చెలి సహించవే సఖీ
నను మరచి నువ్వే జీవించవే
నను మరచి ఓ జీవించవే



Credits
Writer(s): Jeet Ganguly, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link