Korameenu Komalam

కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
తడిసోకు దప్పళం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం
కసిగా కొసలే కొరికేస్తా
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య

బుడమేటి ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవి
నీ ఎండ మావుల్లో నా గుండె బావుల్లో బొచ్చె పరిగెవి ఒక పిచ్చి నురగవి
నిన్నే సాధిస్తా నా సత్తాలు చూపిస్తా సైరా నా సందెపుడకా
నిన్నే కవ్విస్తా నా కౌగిట్లో కట్టేస్తా రావే నా రంభ సిలకా
వడ్డీ బురద కన్నె వాగే వరద
నాకే సరదా పిల్లా నోరే దురదా
పెట్టావంటే పోజు దులిపేస్తా నీ బూజు హో
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య తస్సాదియ్యా
దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు
ముడితీస్తే మోపురం బిడియాల గోపురం
సుడి చుస్తే సుందరం తొడగొట్టే తొందరం
పగలే వగలే దులిపేస్తా
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య

నీలాటి రేవుల్లో నీలాటి చేపల్లో సొగసు తడిసెలే నా పొగరు బెడిసెలే
కళ్ళెట్టి చూస్తుంటే గాలాలే వేస్తుంటే పులస దొరుకునా మన వరస కుదురునా
తోకే జాడించే చెలి కోకిట్టా పారేస్తే ఆరేస్తా తడి తునకా
నన్నే ఓడించి పగబట్టించి వేధిస్తే చూపిస్తా కసి నడక
నేనే గడుసు నాకు నువ్వే అలుసు
నీకేం తెలుసు కలవని కంట్లో నలుసు
అరె ఎక్కిస్తా నా వడ్డు ఎవడొస్తాడో అడ్డు హే
దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు
అరె కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
తడిసోకు దప్పళం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం
కసిగా కొసలే కొరికేస్తా
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్య

Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link