Eppudeppudu

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పడు
గొంతువిప్పలేని గోల ఉంది బోలెడు
పిల్ల వేలెడు, సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు

నడుమా చేతికి రాదు, నడిచి చెంతకు రాదు
గడిచేదెట్టాగో పొద్దు
అడిగే అల్లరివాడు, పడుచుపిల్లకు తోడు
మెడనే మీటేస్తాడు
New zealandలో నూజివీడులా
Love రసాల బారసాల జరుగు జోరులో
బాలచంద్రుడు నేల ఇంద్రుడు
కసికొద్దీ రసమంతా కాజేస్తాడు

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు

తడిసే ఒంటిని చూడు, ఇగిరే వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు
కనుల పాపల జోడి, కలిసే చూపుల వేడి
తెలిపే వలపుల నాడి
Jeans Landలో James Bondలా
Tunes పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు
పడుచు గోపిక పంచదారిక
కొనతీపి తినిపించేదేనాడింక

ఎప్పుడెప్పుడు వలపుచప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండెగుప్పెడు గుట్టువిప్పడు
గొంతువిప్పలేని గోల ఉంది బోలెడు
పిల్ల వేలెడు, సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు



Credits
Writer(s): Mani Sharma, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link