Ravaya Muddula Mama

రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మ
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా
రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మ

మనసైన మాపటి లగ్గం లోన మన పెళ్లి జరిగేను
అక్షంతలెయ్యగా వలపులు రేపు లక్షింతలయ్యేను
నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా
ప్రతిక్షణం మనకింక విలాసమై పోగా
కలలే నిజమై సల్లాపమే సన్నాయిగా మోగే
హే! రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామోయ్
జంట జాగారం చెయ్యాలమ్మ

విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నా ఈడు
మరుమల్లె పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు
సుతారమై నా మేను సితారలా మోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే
ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే
రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మ
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా



Credits
Writer(s): Mani Sharma, Vennalakanti
Lyrics powered by www.musixmatch.com

Link