Raama Sita

రామా సీతా అంటే ప్రేమా ప్రేమా
రాధా కృష్ణ జంటే ప్రేమా ప్రేమా
మనసే మనిషై ఎదిగే ప్రేమా
తనదై తనకై వెలిగే ప్రేమా
ప్రేమే కాదా మధు మహిమా
రామా సీతా అంటే ప్రేమా ప్రేమా
రాధా కృష్ణ జంటే ప్రేమా ప్రేమా

నీలాల మేఘం సూర్యుని ప్రేమా
కార్తీక మాసం జాబిల్లి ప్రేమా
నీలాల మేఘం సూర్యుని ప్రేమా
కార్తీక మాసం జాబిల్లి ప్రేమా
వానై వరదై కలిగే ప్రేమా
పెదవి మురళి కలిపే ప్రేమా
మధురా యమునా పిలుపే ప్రేమా
మధురా యమునా పిలుపే ప్రేమా
ప్రేమే నీకు బ్రతుకు సుమా
రామా సీతా అంటే ప్రేమా ప్రేమా
రాధా కృష్ణ జంటే ప్రేమా ప్రేమా

కొమ్మల్లో రాగం సన్నాయి ప్రేమా
కోవెల్లో దీపం అమ్మాయి ప్రేమా
కొమ్మల్లో రాగం సన్నాయి ప్రేమా
కోవెల్లో దీపం అమ్మాయి ప్రేమా
పువై తావై విరిసే ప్రేమా
ఇస్తే రాని మనసే ప్రేమా
చస్తే అర్ధం కాదీ ప్రేమా
చస్తే అర్ధం కాదీ ప్రేమా
ప్రేమే లేని బ్రతుకు శ్రమా

రామా సీతా అంటే ప్రేమా ప్రేమా
రాధా కృష్ణ జంటే ప్రేమా ప్రేమా
మనసే మనిషై ఎదిగే ప్రేమా
తనదై తనకై వెలిగే ప్రేమా
ప్రేమే కాదా మధు మహిమా
రామా సీతా అంటే ప్రేమా ప్రేమా
రాధా కృష్ణ జంటే ప్రేమా ప్రేమా



Credits
Writer(s): Veturi, K.m. Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link