Ningi Nelaki

నింగి నేలలకి కాదా కళ్యాణం
తూర్పు పడమరల జంటే దాంపత్యం
తనువులు దాటి మనసులు మీటి ప్రేమించు
ప్రాణాల ఆలాపనీ వేళలో
నింగి నేలలకి కాదా కళ్యాణం
తూర్పు పడమరల జంటే దాంపత్యం
తనువులు దాటి మనసులు మీటి ప్రేమించు
ప్రాణాల ఆలాపనీ వేళలో
నింగి నేలలకి కాదా కళ్యాణం

వెన్నెలే తాగకుంటే కన్నులే ఎండిపోవా
మనువులు కోరు కలువలకైనా కలనైనా
వెన్నెలే తాగకుంటే కన్నులే ఎండిపోవా
మనువులు కోరు కలువలకైనా కలనైనా
తొలకరి పూలు ఇలపై రాలు
వేసంగి నిట్టూర్పులో
పదముల మూత సదురుతూ నాట్య
సంగీత నాధాల మేళాల తాళాలలో
నింగి నేలలకి కాదా కళ్యాణం
తూర్పు పడమరల జంటే దాంపత్యం

పెదవులు దోచి మధువులు పోసి
మరిగిన ప్రేమలో
రుస రుసా గాలి విసురునా వాడి
చెదిరిన గూటిలో
వలపన్నదే రోధన
మలుపన్నదే ఇంక లేదా
కుమిలిన జన్మ కురిసిన కంట
కన్నీరుగా జారెనా
తొలకరి వాన చినుకులలోన
ఆకాశ నీడల్లో రాగాలు నీరాయెనా

నింగి నేలలకి కాదా కళ్యాణం
తూర్పు పడమరల జంటే దాంపత్యం
తనువులు దాటి మనసులు మీటి ప్రేమించు
ప్రాణాల ఆలాపననీ వేళలో
నింగి నేలలకి కాదా కళ్యాణం



Credits
Writer(s): Veturi Sundararama Murthy, S R Koteswara Rao, Tv Soma Raju
Lyrics powered by www.musixmatch.com

Link