Nagonthu Sruthilona

నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల

నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల

నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన

ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
ఒక జన్మ పది జన్మలై అనుభంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
పాడవే
పాడవే
కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల

నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన

ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిదురలేపాలని
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా, ఎగిరిపోవాలని
పాడవే
పాడవే
కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల

నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల



Credits
Writer(s): K V Mahadevan, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link