Ni Charanam Kamalam

నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు

నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు

నీచరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం

(సా ని ద మ, ద మ గా)

(గ గ సా ని ద మా ద)

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు, ఆరారు కాలాలు

నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు

అడుగు అడుగున రంగవల్లికలు
పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు
పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు

నీ మౌన గీతాలు

నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు

Credits
Writer(s): Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link