Dorakuna Ituvanti

దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై.
నాలోన కలిగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే ఆ ఆ

ఆఆఆఅ
ఆ నాదాత్మకుడవై నాలోన చెలిగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాదిదేవా
దేవాదిదేవా ఆ
ఆ ఆ ఆఆఆఅ
దొరకునా ఇటువంటి సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్చ్వాసనిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు

నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా
మహానుభావా
దొరకునా సేవ
నీ పదరాజీవముల చేరు నిర్వాణసోపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ



Credits
Writer(s): Sundara Rama Murthy Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link