Ee Manase Se Se (From "Tholiprema")

ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే

ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతో కలవరించెనా
వెనకనె తిరుగుతు చెలి జత విడువదు
దొరికిన వరముతో కుదురుగా నిలువదు
ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే

నీతో చెలిమిని చేసే, నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే
నీతో చెలిమిని చేసే, నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహతహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపును తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే



Credits
Writer(s): Deva, Sirivennala Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link