Induvadana (From "Challenge")

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?
I love you ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
I Love You ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే

కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో - పండిన వెన్నెలవై నన్నందుకో
కసి కసి చూపులతో, కొస కొస మెరుపులతో నన్నల్లుకో
ముకుళించే పెదవుల్లో మురిపాలు
ఋతువుల్లో మధువంతా సగపాలు
సాహోరే... భామా హోయ్!
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?
I love you ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
I love you ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక

మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో - సొగసరి మీగడలే దోచేసుకో
రుస రుస వయసులతో, ఎడదల దరువులతో ముద్దాడుకో
చలిపుట్టే ఎండల్లో సరసాలు
పగపట్టే పరువంలో ప్రణయాలు
జోహారే... ప్రేమ హోయ్!
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?
I love you ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
I Llove you ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link