Ee Jenda

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తనచనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా

(వందేమాతరం
మనదే ఈ తరం
వందేమాతరం
పలికే ప్రతి తరం)

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

శాస్త్రానికి ధ్యానానికి ఆదిగురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతంరా భారతం
ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రంరా భారతం

ఆ దైవం మనకోసం
సృష్టించే ఈ స్వర్గం
ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా
తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ ఋణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా

(వందేమాతరం
మనదే ఈ తరం
వందేమాతరం
పలికే ప్రతి నరం)

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

పిచ్చికుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా
మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్య మొక్కటే సవాలురా

మానవుడే మా వేదం
మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొక మాటరా
ఉక్కు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావు ఎదురైనా భయపడదు మా గుండెరా
శత్రువెవడైనా తలవంచదీ జెండరా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా

(వందేమాతరం
మనదే ఈ తరం
వందేమాతరం
పలికే ప్రతి తరం)

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తన చనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా

(వందేమాతరం
మనదే ఈ తరం
వందేమాతరం
పలికే ప్రతి తరం)



Credits
Writer(s): Mani Sharma, Shakti
Lyrics powered by www.musixmatch.com

Link