Va Va Va

వా... వారెవ్వా వవ్వా రెవ్వా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా
వా... వారెవ్వా వవ్వా రెవ్వా
వా... వారెవ్వా వవ్వా రెవ్వా
వా... వారెవ్వా వవ్వా రెవ్వా

కళ్ళల్లో ద్రాక్షరసం ఒళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా

చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా... వా... ఈడీ కొంటెతనం శొంఠి రసం రా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా
వా... వారెవ్వా వవ్వా రెవ్వా

ఆ పక్క మాయక్క ఎన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మాచెల్లి ఎన్నెల్లో గుమ్మాడి
నడిమద్యనా నేను ఎన్నెల్లో గుమ్మాడి
నిదరోతామగదిలో ఎన్నెల్లో గుమ్మాడి
చిమ్మచీకటిలోన కు కు కు
తిన్నగ నాకాడికొచ్చి కు కు కు
బుగ్గ నిమరగలవా నువ్వు
వా వా ముద్దులెట్టగలవా నువ్వు

తలుపు కిర్రుమనకుండా గురివిందా గుమ్మాడి
తైలాలు పూసిపెట్టు గురివిందా గుమ్మాడి
గోళ్యాలు వెయ్యకుండా గురివిందా గుమ్మాడి
దగ్గరగ వేసిపెట్టు గురివిందా గుమ్మాడి

కాళ్ళకింద ఎత్తుపీట కు కు కు
పెట్టుకొని నిద్దరోతే కు కు కు
గుర్తుపెట్టి ముద్దులు పెడతా వా వా గుట్టంత దోచుకు పోతా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా
వా... వారెవ్వా వవ్వా రెవ్వా

వా... వారెవ్వా వవ్వా రెవ్వా

మీ అమ్మ మీ నాన్న గురివిందా గుమ్మాడి
ఎదురూగ ఉన్నా గానీ గురివిందా గుమ్మాడి
ఊరి జనం అంత కూడి గురివిందా గుమ్మాడి
చూస్తానే ఉన్నకాని గురివిందా గుమ్మాడి
అటు ఇటు చూడకుండ కు కు కు
తిన్నగ నాకాడికొచ్చి కు కు కు
వదిలిపెట్టకుండా నన్ను వా వా
వడిసి పట్టగలవా నువ్వు వా వా
ఊరి చెరువులోన నువ్వు ఎన్నెల్లో గుమ్మాడి
కలువ పూలు కొస్తావుండు ఎన్నెల్లో గుమ్మాడి

మంచినీళ్ళ కోసం వచ్చి ఎన్నెల్లో గుమ్మాడి
కాలుజారి కేకలెడతా ఎన్నెల్లో గుమ్మాడి
కాపాడేటట్టు నువ్వు కు కు కు

నా నడుము పట్టుకుంటే కు కు కు
అందరు సూత్తుండగా నేను వా వా
వంటికదుము కుంటా నిన్నూ

చూపు చూపు కలవాలని గురివిందా గుమ్మాడి
తిరణాళ్ళు వస్తాయంట ఎన్నెల్లో గుమ్మాడి
ఇద్దరొక్కటవ్వాలని గురివిందా గుమ్మాడి
ఎదిగేనంట కంది చేను గురివిందా గుమ్మాడి
వత్తుకో కూడదని కు కు కు
ఇసక మెత్తగుంటదంట కు కు కు
వయసుకొస్తే ఆడ పిల్ల కు కు కు
ఉరుకుతాది గోదారల్లె కు కు కు
ఇచ్చి పుచ్చు కోవాలని కు కు కు
కుర్ర జంట కోరుకుంటే కు కు కు
తాటిచెట్టు సాటు చాలు వా వా
తానినాన నన్నా నా నా

చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా... వా... ఈడీ కొంటెతనం శొంఠి రసం రా
కళ్ళల్లో ద్రాక్షరసం ఒళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా... వా... దీన్ని పట్టబోతే పాదరసం రా



Credits
Writer(s): Mani Sharma, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link