Satte Era Satte

సత్తే

సత్తే యహ సత్తే అరె సత్తే యహ సత్తే ఓ సత్తే అహ సత్తే
ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఓ కలకాలం కాకుల్లాగ గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్
ఏయ్ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్
కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్

ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్ ఓయ్

చెయ్యలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు
అరె చేసిన తప్పే మళ్ళీ నువు చేస్తే తప్పు
ఏ తప్పూ చెయ్యకపొతే అది ఇంకా తప్పు
మరి అంతా నీకే తెలుసనుకోవటం పొరపాటవదా
నువు చేసే పనిలో ప్రాణం పెట్టి దూకెయ్ గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీ దమ్మెంతో చూపించెయ్ అందర్లో
ఉరుమై ఆ మెరుపై పిడుగై నువ్వడుగై అడుగై
సత్తే సత్తే... సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్ ఓయ్

అరె అందమైనదీ లోకం అది చూడకుంటే నీ లోపం
ఈ పగలు రేయి లేకుంటే రోజే అవదు
ఏ కష్టం నష్టం రాకుంటే లైఫే అనరు
మరి అందర్లాగే నువ్వూ ఉంటే రాదే సరదా
పదిమంది నడిచే దార్లో వెళ్తే బోరే అవదా
పనిలేదంటే కొట్టేసెయ్ హస్కైనా
పనికొస్తుందా చేసేసెయ్ రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరలా నువ్ బతికెయ్ బతికెయ్
సత్తే సత్తే సత్తే నీ... ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఓరె ఓరె ఓరె కలకాలం కాకుల్లాగ గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లె దర్జాగుండాలోయ్ ఓయ్ ఓయ్



Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link