Devudey Dhigi

దేవుడే దిగివచ్చినా
స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా
తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే

వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం

కోయిలా నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనే సంతకం
హాయిగా పీల్చుకో ఇలా చల్లగాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమ
అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా
దేవుడే దిగివచ్చినా
స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా
తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే



Credits
Writer(s): Kulashekar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link