Mukundha Mukundha (From "Dasavathaaram")

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
వెన్నదొంగవైనా మన్నుతింటివా
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
జీవకోటి నీచేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

జైజైరాం జైజైరాం జైజైరాం జైజైరాం
సీతారాం జైజైరాం జైజైరాం జైజైరాం
నీలాల నింగికింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగునలేచే.సర్ప శీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
అట అర్జునుడొందెను.నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే
హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా

సాహిత్యం: వేటూరి



Credits
Writer(s): Himesh Vipin Reshammiya, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link