Budi Budi Chinukula Vaana

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో

తళుకు తళుకుమను మెరుపులు వెలుగులు
మిడిసి మిడిసి పడు పరువపు సొగసులు
వగలు తెలిసి మతి చెడినదే ఓ చెలియా

చిలిపి చిలిపి చిరు చినుకుల పొదిగిన
విరుల శరములను వదిలిన మాధనుడి
ఒడుపు తెలిసినది నిన్నిక విడవదుగా
కోరి కన్నేతనం
కోక దాటే క్షణం
కౌగిలింతే సుఖం ఔనా
ఊరించి ఊరించి గోపాలా
ఊగించమాకయ్య ఉయ్యాలా
సిగ్గే అగ్గై రగిలే వేళల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో

మనసుపడిన తొలి వలపుల తహా తహా
ఎగసి పడిన పసి వయసుకు తెలియక
తనువు విరహమున మరిగిన క్షణమిదిరా

పడుచుతనపు రుచి పెదవికి తెలియును
అధర సుధల రుచి మనసుకి తెలియును
మరుల రుచులు మగమతికే తెలియునుగా
ఈడు నీ పొందుకై ఈల వేసే క్షణం బాలక్రిష్ణార్పణం అననా
గుండెల్లో పుట్టింది గిలిగింత
పాకింది మెల్లంగ ఒళ్ళంతా
వయ్యారాలే వరదై పాంగంగా

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో

Credits
Writer(s): Raj-koti, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link