Aidhurojula Pelli (Version 1) [From "Varudu"]

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

(ఆకాశ పందిళ్లు భూలోక సందడ్లు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు)

తుమ్మెదలాడె గుమ్మల జడలు
హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు
పడుచు కళ్లకె గుండెల దడలు
ఆరాళ్లమ్మ కోవెల ముందు పసుపులాటతొ ధ్వజారోహణం
కళ్యణానికి అంకురార్పణం పడతులు కట్టె పచ్చతోరణం

ఇందరింతుల చేయి
సుండరుడీ హాయి
తలకు పోసె చేయి
తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట నీమా నీమారట
పెళ్లికి తరలి వస్తున్నారట
Coffeeలు అడగరట ఉప్మాలు ఎరగరట వీరికి సద్దన్నమే ఘనమౌ

వీరి గోప్పలు చెప్ప తరమా
Band మేళాం అడగరట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళాం ఘనమౌ

వీరి గోప్పలు చెప్ప తరమా
మగపెళ్లి వారట నీ మా నీమారట
పెళ్లికి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి మేం అడగే లేదు
ఇప్పటికైన F A B A చెప్పించండి
చెన్నపట్నం stand అద్దం కావాల్మాకు
దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు
దానికి తగిన wrist watch ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మేం అడగే లేదు
ఇప్పటికైన F A B A చెప్పించండి

చేస్కో love love marriage
Love love love marriage
నచ్చె మెచ్చే అచ్చ girlfriend ఎక్కడ
యె ఎక్కడ

అది లబ్బొ దిబ్బొ గబ్బొ జబ్బొ marriage, love marriage
అది honeymoon అవ్వంగానే damage
ఎవరికి వారె యమునా తీరె package, తోక పీకేజి
అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ, కృష్ణ barrage

(ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
శ్రీరస్తు పెళ్లిళ్లు సుభమస్తు నూరేళ్లు)

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క
అందులొ వెయ్యి సిరిపోగ సెక్క
సున్నమేసావొ నీ నోరు పొక్క
ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక
ఎక్క వచ్చోయి కోమల్లె పక్క

పంచుకొవచ్చు మా పాల సుక్క
పండుకోవచ్చు సై అంటె చొక్కా
తెల్లవారాక నీ బుగ్గ సుక్క
గుమ్మ కెరకాల గురుతైన లక్క
కడిగినా పొద్దు ఈ బంధమల్లొడొ నిండు నూరేల్లదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ
ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ మంచి శకునాల మీ ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ

తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా
గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ
అది మంచు ముత్యమా
మన వధువు రత్నమా



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link