Ye Swasalo

వేణుమాధవా
వేణు మాధవా

ఏ శ్వాస లో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో
ఏ శ్వాస లో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా
మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది
అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి
ఎదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమవుతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక
కనుపాపకి నలు వైపుల
నడి రాతిరి ఎదురవదా
అల్లరి నీ అడుగులుసడి వినబడక
హౄదయానికి అలజడితో అణువణువు తడబడదా

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణు మాధవా నీ సన్నిధి

గ గరి గరి సరి గ గరి రిరి సరి
గపదస సదప గరి సరి
గపదపద గపదసద దపగరిగ
దపద స స దపద స స
దపద రి రి దపద రి రి
దసరి గరి సరి
గరి సరి ద రి గరి సరిగా
రిస గప గగగప ప గగగద ద
గగగస స దపగప దసరి
సరి సరి రిగరిస దసరి
గదప సగరి పగప దసరి
సరిగ పగరి
సద పదపసదస పదపసదస
పదపరిసరి పదపరిసరి
పద సరి గరి సద
పదస గగస రిదస
సరిగ పద సరిగ

రాధికా హౄదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి



Credits
Writer(s): M.m. Keeravani, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link