Neekosam

వేసంకాలం వెన్నెల్లాగా వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం
(తోం ధిరి
తోం ధిరి
తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి)
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం
(తోం ధిరి
తోం ధిరి
తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి)

ఓరోరి అందగాడా
నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం
నీకోసం నీకోసం నీకోసం

నీ సిగ్గుల వాకిట్లొ నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసి సందడివేళ ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం
నీకోసం నీకోసం నీకోసం

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్నపాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా
మొత్తం నీకోసం (నీకోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (కోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (కోసం)

సిగ్గుపోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెత్తు సుకుమారమా
సాయమీయకా మోయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా
మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన
నిద్దర్లొ పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధైలోన ముద్దుల్నెన్నో తెచ్చా
నీకోసం (నీకోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (కోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (నీకోసం)
నీకోసం (కోసం)

వేసంకాలం వెన్నెల్లాగా వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం
(తోం ధిరి
తోం ధిరి
తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి)
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం
(తోం ధిరి
తోం ధిరి
తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి)

ఓరోరి అందగాడా

నన్నేలు మన్మధుడా

నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం
నీకోసం



Credits
Writer(s): M.m. Keeravani, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link