Nadha Vinodham

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ. భంగిమలో ఆ. గానములో ఆ. గమకములో ఆ...
భావములో భంగిమలో గానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ.ఆ.ఆ...!!

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం . ద ని స రి స ని స
జతియుత గమనం . ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం . ఆ...
బ్రతుకు నిత్య నృత్యం . ఆ
భరతమైన నాట్యం . ఆ...
బ్రతుకు నిత్య నృత్యం . ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం .ఝం
నటప్రకృతీ పాదజం . ఝం
నర్తనమే శివకవచం . చం
నటరాజ పాద సుమరజం . ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర.
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ ఆ.ఆ.ఆ!!



Credits
Writer(s): Ilaiyaraaja, Sundara Rama Murthy Veturi
Lyrics powered by www.musixmatch.com

Link