Silakemo

సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ junctionరో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
Massతో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది

హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం

వన్నె చుస్తే పాలంగడి ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి
దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడీ
ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో
Opposition అయిపోతాది అప్పుడే పిండి పిండి
ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ
పూల బండెక్కి వచ్చి పాలబండి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి
Massతో పెట్టు కుంటే మడతడి పోద్ది అద్దీ
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది

హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం

ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి
ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు
ముందు మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు ఇట్టా
వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో
Massతో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది
Massతో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది

హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ junctionరో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
Massతో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది



Credits
Writer(s): Sahithi, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link