Cheliya Ninu

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ
నా మదిలోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ
నా మదిలోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పోయావే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

నెచ్చెలి పైటకు వెచ్చగ తాకే చిరుగాలినై
నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధురమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై
గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే
గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే
నా ఊపిరి చిరునామా నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

మనసా వాచా నీ మదిలోన కొలువుండనా
నా నిలువెల్లా దాసోహాలే చేసేయ్యనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచెయ్యనా
ఏడడుగులతో కొంగు ముడివేస్తా ఏదేమైనా
నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే
నా చంటిపాపవు నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగుల్లో అడుగేస్తూ
నా మదిలోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ
నా మదిలోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పోయావే
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా



Credits
Writer(s): Gantadi Krishna, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link