Avunu Nijam

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా
తెలిసిందే అడగాలా?
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
నిదురోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని మెలిపెడతావేమో
అంతగా కంట చూడమని మొండికేేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనియ్యనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా
తెలుసుకదా
తెలిసే ఇలా చెలరేగాలా

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
తప్పుకో, కళ్ళు మూసుకుని తుళ్ళిరాకే నావెంట
ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంట
నడవదుగా నిను నది వరద
తెలుసుకదా
తెలిసే ఇలా ముంచెయ్యాలా?

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా
తెలిసిందే అడగాలా?
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link