Raagaala Silakaa

మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే
మదిలోన మరులొలికే మరుమల్లె జాతరవే
పొట్టి జళ్ళ పాలపిట్ట
పైట కొచ్చె నెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక
పున్నమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె
నా మనసు ఆగెదెట్టా
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
ఎదలోన ఎలుగు నీడలా
ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

కంటికి కునుకే రాదాయే
నోటికి మెతుకే చేదాయే
ఒంటిలో తాపం ఏదో మొదలాయే
ఎక్కడో కాకులు కూస్తున్నా
ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వనే వెతికే గుండెకి గుబులాయే
నావకడ గట్టిగ అరిచాను
బావ సడి గుట్టుగ అడిగాను
గాలితో కబురులు పంపాను
మబ్బుతో మనసులు తెలిపాను
దేనికీ బదులే రాకా
కుదురే లేకా కన్నీరొలికానూ
ముద్దుల బావా నన్నిక
ఇడిసి పోవద్దూ
ఈ మరదలి పేణం
నీపై ఉందని మరవద్దూ
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా

కళ్ళలో కలతలు తీరేనా
కాళ్ళపై వాతలు మాసేనా
రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా
దాగనీ సొగసులు పొంగేనా
దాగినా దారులు తెరిచేనా
కొంగులో కోలాటాలే కోరేనా
ఆశగా ఆరా తీస్తున్నా
అందమే ఆరాధిస్తున్నా
ఆశగా ఆరా తీస్తున్నా
అందమే ఆరాధిస్తున్నా
ముందుగా బంధం వేసిన హృదయం
లోనికి విందుకు వస్తున్నా
మరదలు పిల్లా నిన్నిక
విడిచీ వెళ్ళనులే
మన పెళ్ళికి లగ్గం
దగ్గరలోనే ఉన్నదిలే
రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
ఎదలోన ఎలుగు నీడలా
ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న
జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే

రాగాల సిలకా రంగేళి మొలకా
రాయంచ నడకా రావాకు తళుకా



Credits
Writer(s): A R Rahman, Siva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link