Bandenaka Bandi

బండెనక బండి కట్టీ పదహారు బల్లు కట్టీ
మెట్టినింటి దారే పట్టే పుట్టినింటి ముద్దే పట్టీ
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
బండెనక బండి కట్టీ పదహారు బల్లు కట్టీ
మెట్టినింటి దారే పట్టే పుట్టినింటి ముద్దే పట్టీ
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా
మనసే ఊయలగా ఊగెను ఈ చెల్లి
ఎండే వెన్నెలగా మార్చినది నా తల్లి
నువ్వే ప్రాణమని నీ నవ్వే లోకమని తలచే అన్ననిలా విడిచి వెళ్ళేవా
ఊరు బోరుమంటుంది నీ తోడు లేక గుండె బావురంటుంది నిను వీడలేక
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా
ఓ బండెనక బండి కట్టీ పదహారు బండ్లు కట్టీ
మెట్టినింటి దారే పట్టే పుట్టినింటి ముద్దే పట్టీ
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
అన్నా ఎల్లి రానా వదినా ఎల్లిరానా ఊరా ఎల్లి రానా సెలయేరా ఎల్లిరానా
రెప్పకు కనుపాప చెప్పే వీడ్కోలు చెల్లే అన్నకిలా చెబుతుంది ఈనాడు
మగాళ్లకెన్నటికీ పుట్టెనిల్లు లోకం
మగువలు పుట్టింది మెట్టెనింటి కోసం
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్లా మనసు ముగబోయనమ్మా



Credits
Writer(s): A R Rahman, Vennelakanti Subbu Rajeswara Prasad
Lyrics powered by www.musixmatch.com

Link