Okka Saari Kindiki Raa

ఒక్కసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా
హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
చల్లబారి పోయిన ఈ కౌగిలిలో కొత్తగా
మళ్లీ వెలిగింతువురా వేడి వెన్నెల
ఎప్పుడో మరిచి పోయా జతలో ముచ్చటా
గురుతే చేసిపోరా మెల్లగా

ఒక్కసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా
హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా

ఓ, నీలి మబ్బు నీడలా నిద్దరోకు మత్తుగా
వేడిగా వేడుకగా వేంట తరమదా
ఒ, పిల్ల గాలి మీదుగా చేరుకోవ చల్లగా
త్వరగా తుంటరిగా తొంగి చూడదా
కిటికీలు తెరిచి ఉన్న ఇటు రావే చొరవగా
అణువైన చీకటున్న ఏం సరదా పడవుగా
ఇది ఏ నాటి జంటవ్వనా

ఒక్కసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా
హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా

ఓ, సొంతమైన సొంపులో ఇన్నీ వింత రంగులా
ఎప్పుడు చూడనిది మేరుపు తళతళ
ఓ, చుట్టుకున్న చూపులో ఎన్ని సూది చురుకులా
సిగ్గులే సిగ్గుపడి నిలవనంతలా
తొలి వెచ్చనైన శ్వాస తనువంతా తిరగని
నిన్ను మెచ్చుకున్న ఆశ అణువణువు కరగని
విరహం బెదరిపోయేంతలా

ఒక్కసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా
హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
చల్లబారి పోయిన ఈ కౌగిలిలో కొత్తగా
మళ్లీ వెలిగింతువురా వేడి వెన్నెల
ఎప్పుడో మరిచి పోయా జతలో ముచ్చటా
గురుతే చేసిపోరా మెల్లగా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link