Yenati Sarasamidi

ఏనాటి సరసమిది ఎన్నాళ్ల సమరమిది
కలహాలు విరహాలేనా కాపురం?
ఓనాటి ఇష్ట సఖి
ఈనాటి కష్ట సుఖి
పంతాలు పట్టింప్పులకా జీవితం?

పురుషా పురుషా ఆడది అలుసా?
అభిమానాం నీ సొత్తా?
అవమానాం తన వంతా?

ఏనాటి సరసమిది ఎన్నాళ్ల సమరమిది
కలహాలు విరహాలేనా కాపురం?

ఆడది మనిషే కాదా?
ఆమెది మనసేగా

సమ భావం నీకుంటే
ఆమె నీ మనిషేగా

ఏ ఎండమావులలో ఒంటరిగానే ఎదురీత
నిన్నడిగి రాసాడా బ్రహ్మ నీ తలరత
తరిగెనేమో సంస్కారం
తిరగబడెను సంసారం

శయనేషు రంభలట, బోజ్యేషు మాతలట
కరనేషు మంత్రులు మాత్రం కారట

నింగిలో తారల కోసం
శ్రీవారి పోరాటం

ఇంటిలో వెన్నెల కోసం
శ్రీమతికి ఆరాటం

ఏ సవాలు ఎదురైనా
నీ శక్తికదే ఉరిపిరి రాయి
ఓనమాలు దిద్దుకు చూడు
ఒద్దికలో ఉన్నది హాయి
చెప్పలేని అనురాగాం
చెయ్యమంటే ఈ త్యాగం

హక్కువున్న శ్రీమతిగా పక్కనుండు పార్వతిగా
కార్యేషు దాసివి ఇకపై కావుగా

పురుషా పురుషా ఆడది అలుసా?
అభిమానాం నీ సొత్తా?
అవమానాం తన వంతా?



Credits
Writer(s): Veturi, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link