Amma Ane Pilichi

జోలాలిజో
లాలిలాలి
జోలాలిజో

అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా
ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా
గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగయ్యిందిరా
చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా
అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా

విషము కూడ అమృతమే అమ్మ తాకితే
నీ తల్లిపాలు విషమురా నువ్వు తాగితే
అంటరాని కన్నతల్లిగా చేశాడురా బ్రహ్మ
ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ
రమ్మనలేను చేరగ నేను శిలను నేనురా
అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా

(లాలిజో
లాలి లాలిజో
లాలిజో లాలిజో)

కంటీ నీటితోనే నీ కడుపునింపుకో
ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో
సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా
నిన్ను మోసి కన్న ఆశలే నీకు దీవెనవగా
అందరి కంటి కాంతిగ మారి ముందుకు సాగరా

అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా
ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా
గర్భగుడిలాంటి అమ్మ ఒడి పాము పడగయ్యిందిరా
చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link