Chaka Chaka Saage - Original

చక చక సాగే చక్కని బుల్లెమ్మా
మిస మిసలాడే వన్నెల చిలకమ్మ
నీ పేరేమిటో
నీ ఊరేమిటో
నీ పేరేమిటో
నీ ఊరేమిటో

గలగల పారే ఏరే నా పేరూ
పొంగులు వారే వలపే నా ఊరూ
చినదాననూ
నే చినదాననూ
చినదాననూ
నే చినదాననూ

కన్నులు చెదిరే
వన్నెల చిలకా నీ వయసే ఎంతా
కన్నులు చెదిరే వన్నెల చిలకా నీ వయసే ఎంతా
చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా
ఊహకు రానంత
అందీ అందక ఊరించే నీ మనసులోతెంతా
మమతే ఉంటే దూరమెంతో లేదూ
నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది
కసి కసి చూపులు చూసే సోగ్గాడా
ముసి ముసి నవ్వులు విరిసే మొనగాడా

నీ పేరేమిటో
నీ ఊరేమిటో
నీ పేరేమిటో
నీ ఊరేమిటో

పదమును పాడే వేణువు నా పేరూ
మధువులు చిందే కవితే నా ఊరూ
చినవాడనూ
నే నీవాడనూ
చినవాడనూ
నే నీవాడనూ

వరసలు కలిపే, ఓ చినవాడా నీ వలపే ఎంతా
విలువే లేనిది వెలకే రానిది వలపే కొండంత
నా వలపే జీవితమంత
నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా
గుండెల గుడిలో దేవివి నీవంటా
సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా

చల్లని గాలీ సన్నాయి ఊదిందీ
పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ
కల నిజమైనదీ ప్రేమ ఋజువైనదీ
కల నిజమైనదీ ప్రేమ ఋజువైనదీ



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link