Balapam Patti

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో hello ఎప్పుడూ?

ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా?
కాస్తైనా ... కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అం, అః అంటా అమ్మడూ ... హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ ... అరె రె ఓహోహోహో!

తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లోయ కోలే మనమెట్టా వున్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
అందాకా ... ఆ మర్రి అత్తమ్మ ఈ మద్ది మామనుకో
బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో hello ఎప్పుడూ?
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో
బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అం, అః అంటా అమ్మడూ ... హొయ్యరే హొయ్యరే హొయ్
హల్లుల్లో hello ఎప్పుడూ?
తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link