Vidduram

ఒలింపిక్ క్రీడల్లో పేకాటకే పెద్ద పీటవేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య VCD చూస్తుంటే
మడోనా మావుళమ్మ జాతరకొచ్చి ఫోకు సాంగు కొడితే
సహారా airlines కే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం
గులాబి రేకుల్తో గుండె జబ్బుకే మందే కనిపెడితే
జిలేబి పానకంతో నడిచే కారులు ఇండియాకు వస్తే
మసాలా దోసెల మీద, పచ్చడి మీద PhD చేస్తే
పొలంలో దుక్కిని దున్నే రైతుకి సైతం లక్షల్లోనె సెల్లు బిల్లు వస్తే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం

సినీతారలు వాన పాటలో నాభి సూపకుంటే
బొడ్డూరం బొడ్డూరం బొడ్డూరం
City రోడ్ల పై యమా స్పీడులో పడవలు వెళుతుంటే
తెడ్డూరం తెడ్డూరం తెడ్డూరం
వందల్లోని మిఠాయి కొట్లో స్వీటే లేకుంటే
లడ్డూరం లడ్డూరం లడ్డూరం
బాడీలోని రక్తం రంగు బ్లాకే అయిపోతే
రెడ్డూరం రెడ్డూరం రెడ్డూరం
తెలుగు film లో తెలుగు పాటలు
తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళతో ఈరోజుల్లో పాడించారంటే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం
కరెంటు బల్బులపై మిణుగురు పురుగులు యుద్ధం ప్రకటిస్తే
సిమెంటు రేకులతోటి కాకులు చిలకలు గూళ్ళు కట్టుకుంటే
కొమ్మపై కోకిల గొంతుకి జలుబే చేసి విక్సు వాడుతుంటే
Non-veg తినడం నేను మానేశానని పులి కుందేలుకి ఫోను చేసి చెబితే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం

పుంజు పెట్ట సరసమాడగా omlette పుడుతుంటే
గుడ్డూరం గుడ్డూరం గుడ్డూరం
తెలుగు భాషలో అక్షరాలుగా x,yలే ఉంటే
జెడ్డూరం జెడ్డూరం జెడ్డూరం
ఉగాది పచ్చడి, chilly chicken -u కలిపే వడ్డిస్తే
ఫుడ్డూరం ఫుడ్డూరం ఫుడ్డూరం
డన్లప్ company తాటాకులతో చాపలు చేస్తుంటే
బెడ్డూరం బెడ్డూరం బెడ్డూరం
సోమవారము మొదలుపెట్టిన చిత్రహింసల TV serial
మంగళవారమే ముగింపుకొచేస్తే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం
ఒలింపిక్ క్రీడల్లో పేకాటకే పెద్ద పీటవేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య VCD చూస్తుంటే
మడోనా మావుళమ్మ జాతరకొచ్చి ఫోకు సాంగు కొడితే
సహారా airlines కే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే
విడ్డూరం... విడ్డూరం... విడ్డూరం



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link