Uththarala Neeli

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరె తొలి కలల వలపు ముదిరె
కొత్త కొత్తందాలు మత్తెక్కించె జోరులో
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

ఈ కన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్దంటున్న మోమాటాల పక్కనా
ఓ ముద్దు ముద్దంటాయే ఆరాటాలు ఏక్కడో
చేరుకో పోదరిళ్ళకి చీకటి చిరుతిళ్ళకి
అలకాపురి చిలకమ్మకి కులుకెందుకో ఒకసారికి
ఒళ్ళే వేడెక్కింది గిల్లి కజ్జా ప్రేమకి

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేలా మంచాలేసి సంకురాత్రి చేసుకో
మా మల్లె మాగాణుల్లో మాసులంత చేసుకో
పూబంతి పువ్వందాలు పండిగిట్టి వెళ్ళిపో
పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో
మరు మల్లెల మహరాజుకి తెరచాటులా ప్రతి రోజుకి
ఆపేదెట్టాగాట్ట పూవ్వై పోయే రెమ్మని

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరె తొలి కలల వలపు ముదిరె
కొత్త కొత్తందాలు మత్తెక్కించె జోరులో
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link