Chinuku Chinuku

చినుకు చినుకు పడుతుంది
మనకు వణుకు పుడుతుంది
ఉరుము ఉరుము కలిసింది
గుబులేసి పిడుగు పడనంది

చినుకు చినుకు పడుతుంది
వణుకు వణుకు పుడుతుంది
ఉరుము ఉరుము కలిసింది
గుబులేసి పిడుగు పడనంది
ఇది మరువలేని రోజంది
మన దూరం తరగాలంది
నే ఎన్నడరగనీ వింత
సరి కొత్తగుంది పులకింత
బిడియాలు మాని సడి చేయకుండా
నా ఒడికి చేరమంటోంది
చినుకు చినుకు పడుతుంది
మనకు వణుకు పుడుతుంది
ఉరుము ఉరుము కలిసింది
గుబులేసి పిడుగు పడనంది

వయ్యారి నీ కళ్ళు
ఆ తారకలకు చెల్లెళ్ళు
మెరిసేటి అరె నవ్వుల్లు
ఆ పాల ధార పరవళ్ళు
నన నన నన నన
నన నన నన నన నా పాల
నీ చూపుల్లో విడిపించుకోని సంకెళ్ళు
దీపాల మునిమాపుల్లో
కర్పూరమాయే కౌగిళ్ళు
ఇంకెంత దూరం అధరాలు
చాటెయ్యమాకు పరదాలు
మరి సాగిపోని సరదాలు
ఇక ఆగిపోని విరహాలు
పదహారు వయసు పరువాలతోటి
పడుచాట ఆడమంటోంది
చినుకు చినుకు పడుతుంది
మనకు వణుకు పుడుతుంది
ఉరుము ఉరుము కలిసింది
గుబులేసి పిడుగు పడనుంది

పగడాల నీ పరికిణికి
ఎంత గర్వమొచ్చింది
ఇంతైనా చూడనీకుండా
నాపైన కక్ష కట్టింది
నన నన నన నన
నన నన నన నన ఇంకెంత
ఈ గిలిగింత ఏడడుగులే కదా ఉంది
అందాక ఆత్రమేనంటూ
కాస్త అడ్డుపడుతూ ఉంటుంది
పైటమ్మకు జాలే రాదా
చిట్టమ్మకు నిదురే రాదా
ఈ రేయికి తెలియని బాధ
పెదవిచ్చుకుంటే సరిపోదా
ఏ జన్మకైనా ఈ ఘడియలింకెపుడు
తిరిగి రావు అనిపించాలా
చినుకు చినుకు పడుతుంది
మనకు వణుకు పుడుతుంది
ఉరుము ఉరుము కలిసింది
గుబులేసి పిడుగు పడనంది



Credits
Writer(s): K.v.mahadevan K.v.mahadevan, Sirivennela Seetharamashastry
Lyrics powered by www.musixmatch.com

Link