Enduko Madi

ఎందుకో మది నమ్మదే ఇది
ముందున్నది నిజమంత నిజమే అంద సంగతి
అవునా అంటున్నది నన్నిలా విడిచి ఏ లోకంలో ఉంది
మొదలైన సంతోషము తుది లేని సందేహమో

నువ్వేనాడో తెలుసునంది మనసు, ఎల్లాగో ఏమో
నిన్ను చూడగానె గుండెలో ఇదేమి కలవరమో
కలలైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నది
నడి రేయిలోని నలుపెంత గాని
నీడైన వేకువని వింత ఏమిటుంది

కాలం వెంట కదలలేని శిలగా ఎన్నాళ్ళిలాగ
ఎటువైపు అంటే ఏ క్షణం జవాబు ఇవ్వదుగా
పడి లేవ లేవ పరుగాపుతావ
అడివైన దాటి అడుగేయవా
సుడిలోని నావ కడ చేరు త్రోవ
నువు చూపుతావనే ఆశ రేపుతావా

ఓహు ఓహు
నీకే నువ్వో ప్రశ్నగా నిను నువ్వే వెతుక్కో కదా
నీ ఏకాంతమే కొద్దిగా నాకు పంచగా
నిను ఆగనీక కొనసాగనీక
తడబాటు ఏమిటో చెప్పలేనితనమా



Credits
Writer(s): Achu, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link