Cheppaka Thappaduga

Boy Come On Out, You Gotta Take A Look Now
Take Your Heart Out And Set It On Me Now
ఇక చెప్పక తప్పదుగా,
అని అనుకొని వచ్చా ఈ వేళ,
చెబితే, నువ్వేమంటావో తెలియదుగా?
అరె ఎప్పటికప్పుడిలా, (ఊహు ఆహ)
ఇపుడే మొదలని అనుకోవాలా?
సరెలే, వింటా మళ్లీ మరో కొత్త కధలాగా.

ఇంకా ఏం చెప్పందే, మొన్నెప్పుడో విన్నట్టే,
నువ్వేదోలా ఉన్నావంటే, వదిలేద్దాంలేహియే...
ఇవ్వాళే ఈ పూటే, తెల్చేద్దాం కానీలే,
సిద్ధంగానే ఉన్నాలే.

తడితడి పెదవుల తలతల మెరుపులు
తగిలిన తలపులు విలవిలలాడేలా నవ్వితే ఎలా
పొడిగా విడిగా మడిగా గొడుగాపాలా తమరినిలా
కిల కిల సడి కవ్విస్తుందో కసిరిందో గుర్తించేదెలా
మనసేమందో వినలేవా సరిగా
నాలా నువ్వై నిలువెల్లా నిను నువ్వే గమనిస్తే నాలాగే గల్లంతై పోతావే
పోనీలే క్షమించెయ్, పేచీలెందుకులే,
చాల్లే ఎన్నాళ్లీ దోబూచీ, రాజీ పడదాం ఎంచక్కా.
Perhaps, Perhaps Some... (All Right)

ఎదురుగ దొరికితె కదలవు మెదలవు ఉలకవు పలకవు నిలబడి చూస్తావే ఎంతసేపిలా
అపుడూ ఇపుడూ ఎపుడూ కొత్తగ ఉందే ఎందుకిలా
నీ తికమక చూస్తూ సమయమాగాలా నీ కోసమలా
పరవాలేదే నువు లేవా జతగా
ఆకాశంలో ఎగరేస్తానంటావా,
నన్నే మాలోకంలో ముంచేస్తానంటావా.
నీ వల్లే ఇదంతా, నన్నే నీ వెంట, దారి తప్పించి తిప్పించి వదిలేస్తావా ఒంటరిగా

ఇక చెప్పక తప్పదుగా,
అని అనుకొని వచ్చా ఈ వేళ,
..., నువ్వేమంటావో తెలియదుగా?
ఇపుడే మొదలని అనుకోవాలా?
సరెలే, వింటా...

ఇంకా ఏం చెప్పందే, మొన్నెప్పుడో విన్నట్టే,
నువ్వేదోలా ఉన్నావంటే, వదిలేద్దాంలేహియే...
ఇవ్వాళే ఈ పూటే, తెల్చేద్దాం కానీలే,
సిద్ధంగానే ఉన్నాలే.



Credits
Writer(s): Arun R. Rajamani, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link