Mabbe Masagesindile

హే ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే

కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన
గుబులౌతుందే గుండెల్లోనా
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందాము మనము
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే

పండే పచ్చని నేల అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేల అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించువేళ
తెలుసుకో పిల్లా ఈ బిడియమేలా మళ్ళా
ఉరికే పరువమిది మనది
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే

నవ్వని పువ్వే నువ్వు నునువెచ్చని తేనెలు ఇవ్వు
దాగదు మనసే ఆగదు వయసే
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు ఇద్దరమొకటవనీ కానీ
హే బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచిసోటే మనకు కుదిరిందిలే

Credits
Writer(s): Achu, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link