Vellipothe Elaa

వెళ్ళిపోతే ఎలా మనసా
ఎటో అలా
అయినా ఎందుకని ఇలా
తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే
తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే
ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా

ఆమె వలలో చిక్కుకుందా సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేనిప్పుడెక్కడున్నానంటే
నాక్కూడా అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే
నాకేదో మత్తు కమ్మినట్టే

రమ్మంది గాలి నను చేరి
మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలి దారి
చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా
అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

తాను కూడా రాకపోతే నాతో
నేను కూడా ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తననంటే
కళ్ళారా చూసానంటూ ఉంటే
ఎల్లా నమ్మేది స్వప్నమంటే

వెనక్కి వెళ్లి వెతకాలి
తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి
కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా
అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా



Credits
Writer(s): M.m. Keeravani, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link