Allo Nerello

అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో

జనకుని కూతురు జానకి అల్లోనేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరేళ్లో
ముద్దుగా పెరిగిన జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో

(అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లోనేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరేళ్లో
ముద్దుగా పెరిగిన జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో)

(అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో)

ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం
ఎదురుచూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం

మగువ మనసుకి ఏనాడో మనసైన వాడే ఆభరణం

(అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో)

చేయిజారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందజేయగలనా
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా

చేరువై నా మనోవేదన మనవి చేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా

(అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో)



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link