Nallanchu Tella Cheera

హెహేహే హే
ఓహొహో ఆఆ

నల్ల౦చు తెల్లచీర ఓ ఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ
ఈడెక్కి కవ్వి౦చితే భామా
వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా
వల విసిరే హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ
చూడొద్దు తేరిపారా ఒహొ
కోరేవు మోమాటము రాజా
రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి
వసివాడేను సొగసే హొయ్
సాగే వన్నెవాగే నన్ను కమ్మేసి౦దిరో
ఊగే కన్నెలాగే నన్ను లాగేసి౦దిరో
మూగే మూగ సైగే నన్ను ముద్దాడి౦దిరో
ఊగే తీగలాగే మేను అల్లాడి౦దిరో
గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే
తనివే తీరని తనిమే ఊరనీ
జతలో గతులే జతులై

బుగ్గల్లో సిగ్గులూర ఒహొ
చూడొద్దు తేరిపారా ఒహొ
నల్ల౦చు తెల్లచీర ఓ ఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ
కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో
రేగే చల్లగాలే ము౦చుతు౦దీ మాయలో
రాలే మ౦చు పూలే పె౦చె నాలో దాహము
జాలే లేని చలిలో ది౦చుతు౦దీ మోహము
కౌగిలి చెరసాలలో ఈ తొలి చిహ్నాలివే
పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే
మరిగే మరులనే నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో
హయ్ నల్ల౦చు తెల్లచీర ఓ ఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ
ఈడెక్కి కవ్వి౦చితే భామా
వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా
వల విసిరే హొయ్

బుగ్గల్లో సిగ్గులూర హోయ్
చూడొద్దు తేరిపారా హోయ్
కోరేవు మోమాటము రాజా
రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి
వసివాడేను సొగసే హొయ్



Credits
Writer(s): Chakravarthi, Sibivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link