Nee Kokakintha

ఓయ్ నీ కోకకింత కులుకెందుకు
రప్పపప రప్పప రప్పపపప
నీ రైకకింత బిగువెందుకు
రప్పపప రప్పప రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా
శింగారాన్ని దాచుకున్నందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా హా

నీ చూపుకింత చురుకెందుకు
రప్పపప రప్పప రప్పపప
నీ చేతికింత చొరవెందుకు
రప్పపప రప్పప రప్పపప
అందాలన్నీ కొల్లగొట్టేందుకా
ఆరాటాలు చెల్లబెట్టేందుకా
మెత్తంగ మొత్తంగ దోచేసిపోయేందుకా హ

నీ కోకకింత కులుకెందుకు
నీ చేతికింత చొరవెందుకు
అరెరే నీ ఒంటి మెరుపంత తాగి
నా కళ్లు ఎరుపెక్కి తూగే
రమ్మంది నీ కళ్ల జీర
బరువైంది నా గళ్ల చీర
కుబుసం విడిచిన నాగులా
బుస కొట్టే నాజూకులు
చిలిపిగ తాకిన చూపులో
చలిపెంచే వడగాడ్పులు
ఈ కొత్త ఆవిర్లు ఈ తీపి తిమ్మెర్లు
అయ్యయ్యయ్యయ్యో మెలిపెట్టిలాగాయి
నీ ముందుకు

నీ కోకకింత కులుకెందుకు
నీ చేతికింత చొరవెందుకు
అహా అహా ఒణికింది
తొలి ఈడు తీగ
ఓ కొంటె గిలిగింత రేగ
కౌగిల్లే పందిళ్లు చేసి
పాకింది కలలెన్నో పూసి
కవ్వించే ఈ హాయిలో
చెఖుముఖి రాపిడి చూడు
కైపెక్కే సైయ్యాటలో
తికమక తకధిమి చూడు
ఈ మంచు మంటల్లో మరిగేటి మోజుల్లో
అమ్మమ్మమ్మమ్మమ్మో ఈ ఉడుకు తగ్గేది
ఏ మందుకు

నీ కోకకింత కులుకెందుకు
రప్పపప రప్పప రప్పపపప
నీ చేతికింత చొరవెందుకు
రప్పపప రప్పప రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా
ఆరాటాలు చెల్లబెట్టేందుకా
అరే చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా
ఓ ఓయ్ ఓయ్

నీ చూపుకింత చురుకెందుకు
నీ రైకకింత బిగువెందుకు హా



Credits
Writer(s): Chakravarthi, Sirivennela, Seetarama Shastri
Lyrics powered by www.musixmatch.com

Link