Ee Chempaku Selaveeyaku

ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని వదిలేయకు
చాలని అనకు
రాతిరి మనకు
మోహాల సంకెళ్ళు విడిపోనీకు

ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని వదిలేయకు

నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు పాడే పల్లవి
తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగ
కంటి చూపు చీర కట్టాలి ఒంటిని
కంచి పట్టు చీర జారాలి నేలనీ
ఈ వేడీలో వాడనీ
ఈ గాలినీ పూలనీ
గండి పడ్దది నింగి చెరువుకి
వెండి వెన్నెల పొంగుతున్నదీ
పొవింత తుళ్ళింత వెల్లువయ్యేలా

ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని వదిలేయకు

పై పైకి రాకు సూర్యుడా
పొద్దంటే మాకు చేదురా
తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ కోరికా
కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు
వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు
ఈ రేయిని ఆగనీ
ఈ హాయినీ సాగనీ
పాలపుంతలో పూల వేడుక
కౌగిలింతలో ఇలకు జారక
తాపాల దాహాలు తీరిపోయేలా

ఈ చెంపకు సెలవీయకు
ఈ పెదవిని
చాలని అనకు
రాతిరి మనకు
మోహాల సంకెళ్ళు విడిపోనీకు



Credits
Writer(s): Chakravarthi, Sibivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link