Rana Priya

రానా ప్రియా చిరు నగవుల
సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
రానా ప్రియా మది వనముల
ఘుమ ఘుమ సుమమై
రానా ప్రియా మునుపెరగని అనుభవమై
మనసుకే వేకువనై వయసుకే వేసవినై
నువ్వంటే అంటే నేనేరా
నీ వెంటే వెంటై రాలేనా

రానా ప్రియా చిరు నగవుల
సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై

వెలిగే వెలుగు నువ్వే అయితే
వెనకే నీడై రాలేనా
వేసే అడుగు నువ్వే అయితే
అడుగుల జాడై రాలేనా
నువు కలవైతే కలవరమవనా
ఆ... నువు కలమైతే కవితై రానా
నేనే ప్రేమై ఈ లోకమే ఆక్రమించనా

రానా ప్రియా చిరు నగవుల
సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై
రంగూ రూపు భాషే లేని భావం
మనమై పోదామా
నేడూ రేపూ కాలం లేని
తీరం వైపే పోదామా
సెలవులు లేని కొలువులు మనవి
చెరపగ లేని చరితలు మనవి
గతమై పోలేలేని అనుభూతికై స్వాగతించనా

రానా ప్రియా చిరు నగవుల
సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై

మనసుకే వేకువనై వయసుకే వేసవినై
నువ్వంటే అంటే నేనేరా
నీ వెంటే వెంటై రాలేనా
రానా ప్రియా చిరు నగవుల
సరిగమ స్వరమై
రానా ప్రియా పది యుగములో పరిచయమై



Credits
Writer(s): Chandra Bose, Shaan Rahman
Lyrics powered by www.musixmatch.com

Link