Chirunama Thana Chirunama - From "Ekkadiki Pothavu Chinnavada"

तेरी मेरी मेरी तेरी मेरी
प्रेम कहानी है मस्त मस्त

నువ్వేలే నా జీవితం
సోగకళ్ళ సోయగం
తాగుతుంటే మనసు నిండ इश्क इश्क

చిరునామా తన చిరునామా మరచిపోయెనే
చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే
సీతాకోకచిలుక అలక
నీ రంగులన్ని దాచకే చాలిక
మెరుపులాగ మాయమే అవక
ఆ మేలిముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక
మబ్బుల చాటునున్న చందమామ బైటికే వచ్చేదెన్నడో
గీతల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడో

खुदा ने तुझे मेरे लिए
परी बना के दिया
प्यार की तेरी धुन मे
मै खो गया मिट गया
उसके नशा मे मौला
మపని సానిస మపనీ నిపని
మపని సాసని నీనిస నిససరి రిగ గపమా

కన్నె కశ్మీరం నువ్వో
వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వో తేలేదెలా
హే రోజూ బజారుల్లోన లేని సరికొత్త జోరే
సరదాలు పంచుతోంది నీవల్లేగా వెన్నెలా
ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నీదో కాదో తేలేదాక మనసు విస్మయం
కొంచెం బాధ కొంచెం చేదు
కొంచెం తీపి కొంచెం గాయం
అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం

చిరునామా తన చిరునామా మరచిపోయెనే
చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే

सूफियाना सूफियाना
खा ली पी ली
मेरा दिल ने चली रे
है अल्लाह क्या बताऊ
ले चली ले चली मेरी रूह ले चली

ఊహంటే అర్థమంటే
ఊహించలేని నేను
నీ ఊహల్లోన మునిగిపోయానిలా
ఏ గాల్లోన తేలడాన్ని ఇన్నాళ్లూ తప్పుబట్టి
ఈ వేళ నేలపైన నేను కూడ లేనలా
నువ్వులేని దారి ఊహకందకుందిలే
నువ్వు పీల్చేగాలి నాకు ఊపిరయ్యెనే
ఊహలాగ గాలిలాగ కానరాని నిన్ను నేను
గాలి ఊహల్లా మారి గాలిస్తున్నానే

మబ్బుల చాటునున్న చందమామ బైటికే వచ్చేదెన్నడో
గీతల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడో



Credits
Writer(s): Shekhar Chandra, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link