Ithadena Ithadena

తెలుసా తెలుసా తెలుసా
ఈ చనువుకు పేరేంటో
తెలుసా తెలుసా తెలుసా
ఈ తెలియని పరుగేంటో

ఎవరైనా ఎపుడైనా
ఈ మాయేది చూసుండరే
ఎవరైనా ఎపుడైనా
ఈ ఊసేది విని ఉండరే

అల్లరి మనసా అడిగేయవే
ఏంటీ వరస అని నువ్వే
మదిలో మెరిసే చిరునవ్వే
కళ్ళ ముందుంది చుశావటే

ఇతడేనా ఇతడేనా
నీ కళ్ళలో దాగి ఉన్నది
ఇతడేనా ఇతడేనా
నీ జత అంటున్నది

ఇతడేనా ఇతడేనా
నీ కళ్ళలో దాగి ఉన్నది
ఇతడేనా ఇతడేనా
నీ జత అంటున్నది

చెలిమిని దాటి నడిచెనులే
నా కలలే ఓ కథలా
నిదురను దాటి పిలిచెనులే
నీ ఊహ నన్నిలా

ఎందుకు నిన్ను కలిశానో
తెలిసెనే నాకు ఈ వేళ
ఏ దూరాలు కరిగేనో
ఈ దారి లోపల

ఇన్ని నాళ్ళు నాలోన
ఇంత కాంతి లేదైనా
ఇంతలోనే లోలోన
కన్నులే చూడని వెన్నెలే విరబూశాలే నీవల్లే

ఇతడేలే ఇతడేలే
నా కళ్ళలో దాగి ఉన్నది
ఇతడేలే ఇతడేలే
నా జత అంటున్నది

ఇతడేలే ఇతడేలే
నా కళ్ళలో దాగి ఉన్నది
ఇతడేలే ఇతడేలే
నా జత అంటున్నది



Credits
Writer(s): Mickey J Meyer, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link