Modalaudaam

మొదలౌదాం తొలి ప్రేమగా
అపుడో ఇపుడో ఎప్పుడైతేనేం కొత్తగా
జత పడదాం ఒక జన్మగా
మన్లో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా

ఏ నిమిషం నిను చూశానో, ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో, నీ ఎదలో స్థిరపడిపోయా
ఏ నిమిషం నిను చూశానో, ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకొకైయ్యా
ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహాలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే
ఓ నేను, నేను కానులే
నువ్వు, నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలిందీ ప్రేమే
ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహాలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే

హే నువొచ్చి చేరగా
అదేంటో గాని నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రానుగా
మనకు లేనే లేవుగా కల నిజం రెండుగా
ప్రతీ జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా
ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహాలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే

ఈ చిన్ని గుండెలో
నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచాలే చెలి
ఒక్క మాటలో రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి
ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారధి
వందేళ్ళ బాటలో ప్రేమే మనకు అథిది
ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహాలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే



Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link