Saagara Sangamame

సాగర సంగమమే
ప్రణయ... సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయ... సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో... ఇలలో
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే
ప్రణయ... సాగర సంగమమే

కన్యాకుమరి నీ పదములు నేనే
కన్యాకుమరి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ
అలిగిన నా పొల అలకలు నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర సంగమమే
ప్రణయ... సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళ
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే



Credits
Writer(s): Ilaiyaraaja, Sundara Rama Murthy Veturi
Lyrics powered by www.musixmatch.com

Link